ముందుగా మా అమ్మ గురించే చెప్పాలనుకుంటున్నాను.. అమ్మ ఆ రోజుల్లో ఏడో తరగతి వరకే చదివింది. మా తాతయ్యకు ఆరుగురు సంతానం. మా అమ్మ ఇంటికి ఐదవ సంతానం. అప్పట్లో ఆడపిల్లలను బడికి పంపడమే అరుదుగా మరి.
అమ్మకి అందరికి పంచే గుణం, దాతృత్వం ఎక్కువే మొదట్నుంచి. ఉన్న దానితో సర్దుకుపోయే తత్వం తనది. తనపై ఇసుమంతా ప్రేమ చూపినా పొంగిపోయి విపరీతంగా ఆదరిస్తుంది. ఏ పని చేసినా చాలా శ్రద్దతో బాధ్యతగా వ్యవహరిస్తుంది. ఎవరి తోనూ మాటపడే తత్వం కాదు తనది. చాలా సాదాసీదాగా ఉంటుంది. క్రమశిక్షణకు, కట్టుబాట్లకు కట్టుబడి ఉంటుంది. సొంతవారిని అందరిని చేరదీసింది. కష్టించే తత్వం తనది.
అమ్మ వ్యవహార శైలిలో బలం బలహీనతలు రెండు చోటు చేసుకున్నాయి.
అందులో మొదటిది కుటుంబంలోని బంధువులను అతిగా నమ్మడం. ఎవరు ఏమన్నా నమ్మే తత్వం.
ప్రతి విషయంలో వారాలు వజ్యలు అంటూ వాదిస్తుండడం
ముక్కుసూటిగా పోయే తత్వం చాలా సార్లు కొంప ముంచాయి.
చెప్పిన విషయాన్నే మళ్లి మళ్లి చెప్పడం.
కొన్ని చిన్న విషయాలకు కూడా అతిగా ఆలోచించడం. ఒక్కోసారి అతిగా కోప్పడడం నాకు అసలు ఇష్టం ఉండేది కాదు
మా నాన్న గురించి :
ఆయనలో అణువంతయినా మంచితనం నేనిప్పుడు చూడలేదు. అయన కోసం చెప్పేందుకు కూడా మాటలు చాలవు. అటువంటి వ్యక్తీ కోసం చెప్పిన వ్యర్ధమే. నిజంగా ఆయనంతా నీచుణ్ణి వల వేసిన పట్టలేము ..అమ్మను ఎంతగానో భాధ పెట్టాడు. ఆయనది విపరీతమైన శాడిజం . ఏ రోజు మాతో ప్రేమగా ఆప్యాయంగా వ్యవహరించింది కూడా లేదు. ఆయన నిలువెల్లా విషం . బిడ్డల దగ్గరే స్వార్ధం చూపే నైజం తనది. తనకు తెలిసిందల్లా తను సంతోషంగా ,తృప్తిగా వుంటే చాలు . కన్న బిడ్డలు బాగున్నా చూడలేని తత్త్వం . ఎదుటవారు సంతోషంగా ఉంటే ఓర్వలేని గుణం ..జల్సాలకైన డబ్బు వెచ్చిస్తాడు . కానీ ఎవరికీ పెట్టే బుద్ది లేదు . తను చేసిందే, చెప్పిందే న్యాయం . తను తప్ప అందరు వెధవలే అని ఎవ్వరిని లెక్కచెయ్యని తత్త్వం.ఎదుటవారిలో తప్పులను మాత్రం లెక్కించి తన తప్పులను మాత్రం మరిచే గురివింద నైజం తనది.అసత్యం , అహం , ఆడంబరం ,డాంబికం, స్వార్ధం ,వ్యసనపరుడు ,అసూయ ,శాడిజం ఇంతే మా నాన్న గురించి.
మా అమ్మ ఓర్పుకి నిజంగా చెయ్యెత్తి మొక్కాలి , ఆయనతో సంసారం చేసి మమ్మల్ని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పినందుకు .
