Sunday, November 27, 2011

పాయకరావు పేటలో చిన్నప్పుడు

మా అమ్మ వాళ్ల అమ్మానాన్న పేరులు సూర్యాకాంతం, లక్ష్మణ స్వామి..నాన్న వాళ్ల అమ్మనాన్న పేర్లు పోలమ్మ, కోటయ్య. అమ్మ వాళ్ల కుటుంబం తునిలో ఉండేది..కొన్ని అనివార్య కారణాల వలన తాత ఇల్లు అమ్మి కూతుళ్ల పెళ్లిళ్లు  చేసేందుకని తరువాత పాయకరావు పేట లో స్థిరపడ్డారు. తాతకు మొత్తం నలుగురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. అమ్మ ఈంట్లో 5 వ సంతానం. నాన్న వాళ్ల తల్లిదండ్రుల ఊరు అన్నవరం ప్రక్కన ఉన్న చిన్నయ్య పాలెం. నాన్నకు ఇద్దరు అక్కలు, ఆయనే చివరి వాడు.అప్పట్లో మా నాన్నకు పెళ్లికని మూడువేల రూపాయల కట్నం ఇచ్చారంట..ఆప్పటి పరిస్థితులకు అది పెద్ద మొత్తమే మరి. చిన్నప్పటి నుంచి అమ్మానాన్నలకు మనస్ఫర్ధలు.ఎప్పుడు గొడవలే.ఎందుకంటే నాన్న గొడవ మనిషి మరి.వాళ్ల కుటుంబం కూడా అంతే. అందుకే నాకు మా నాన్న తో సహా ఆ కుటుంబంలో వాళ్లు ఎవ్వరు నచ్చరు మరి.         


         నాకు బహుశా ఒక మూడేళ్ల ప్రాయం అనుకుంటాను.. మొదట్నుంచి అమ్మకి నాన్నకి నేను పుట్టక ముందు నుంచి గొడవలంట.. నాకు బాగా గుర్తు నేను మా అమ్మమ్మ వాళ్లింట్లో ఉంటుండగా మా నాన్న వచ్చి మా అమ్మను నీళ్లు మోసే కావిడ బద్దతో విపరీతంగా కొట్టాడు. అది నాకు ఊహ తెలియనప్పుడు జరిగినప్పటికిని ఆ సంభావం ఇంకా నాకు బాగా గుర్తు. అప్పుడు మా తాతయ్య మా అమ్మను పోచీకత్తుల తోటి అమ్మను నాన్నతోటి పంపారంట. నేను పుట్టినప్పుడు ఒకే వరదలంట పాయకరవు పేటలో. అందువలన ఊరి ప్రజలందరూ పాండురంగస్వామి వారి గుడిలో తలదచుకున్నారంట..వరద నీళ్లు గుడి గోపురాన్ని తాకాయంట..


పెళ్లయిన కొత్తలో అమ్మను నాన్న తీసుకువెళ్లిన తొలి సినిమా ' అన్వేషణ ' తరువాత  ' కాష్మోరా '. ఇందులోనే అర్ధం చేసుకోవచ్చు మా నాన్న అభిరుచి ఏమిటో. నాన్న కొన్నాళ్లు విశాఖపట్నంలోని టి.సుబ్బిరామి రెడ్డి కంపెనిలో ఏదో చిన్న పని సంపాదించారంట..తరువాత దేనికనో పని మానేసి మకాం ఏలూరికి మార్చారు. మొదటి నుండి మా నాన్నకు స్థిరత్వం ఉండేది కాదు. దానితో అమ్మ చాలా బాధ పడేది.    

No comments:

Post a Comment