ముందు మేము ఏలూరులో ఒక ముస్లిం వాళ్ల ఇంట్లో అద్దెకు ఉండేవాళ్లం. ఆ ప్రదేశం నాకు సరిగ్గా గుర్తు లేదు కాని అక్కడ బీడీలు చుట్టడం మాత్రమే వృత్తని మాత్రం తెలుసు. అప్పుడు అమ్మానాన్న అంబికా అగరబత్తుల వారి కంపెని వాళ్ల ఇంట్లో దోబిలుగా పని చేసేవారు. పనికి దూరం కావడంతో ఆ ఇల్లు ఖాళీ చేశారు. తరువాత అక్కడ జీతం పెంచకపోవడంతో అక్కడ పని మానేశారు.
అప్పుడు ఏలూరులోని పవర్ పేట అనే చోట్లో ఉండేవాళ్లం. మా ఇంటి ప్రక్క రాజు అనే వ్యక్తి ఇల్లు వుండేది.. నాకు తెలిసి అప్పటికి టి.వి ఉన్న ఇల్లు ఆ ప్రదేశంలో వాళ్లది మాత్రమే.అక్కా,నేను మాత్రమే కాదు చుట్టు ప్రక్కల ఉన్న పిల్లలంతా కూడా అక్కడే వుండేవాళ్లం సాయంత్రమైతే. అప్పటికి మాకు తెలిసింది ఈ టి.వి,దూరదర్శన్ మాత్రమే. చిన్నప్పుడు పిల్లతో సరదాగా సాయంత్రం బడి నుండి వచ్చిన వెంటనే ఆటలతో గడిపేవాణ్ణి.
ఒకసారి ఏమైందంటే నేను చిన్నప్పుడు నాన్న ఇస్తీ షాపు ప్రక్కన సాయంత్రం ఆడుకుంటున్నానంట. చీకటి పడడంతో అందరూ ఇంటికి తిరుగుముఖం పట్టారంట. ఒక్క నేను తప్ప. చీకటి పడుతుంది గనుక అమ్మ నాతో ఆడుతూ ఉన్న పిల్లలందర్ని అడిగిందంట మా అబ్బాయి ఏమైనా కనబడ్డడా అని. సమయం రాత్రి 10 కావచ్చిందంట. ఇంతలో అటు ప్రక్కన కలప, కట్టెలు అమ్మే ఒక షాపు ఉందంట..అది ఓపెన్ లో ఉండడంతో ఒకవేళ ఎందుకైనా మంచిదని అక్కడ వెదికి చూశారంట. అక్కడ పెద్ద దుక్కుల మధ్య పడుకొని ఉన్నానంట. అమ్మ భోరున విలపించిందంట ముందు కనబడకపోయేసరికి. అప్పుడప్పుడు అమ్మ ఇది చెప్పుతుంది నా బాల్యాన్ని గుర్తు చేస్తూ.
అలాగే మరొక చిన్న చిలిపి పని. చిన్నప్పుడు ఒక చిన్న దొంగతనం చేశాను..జీవితంలో అదే నా మొదటి మరియు చివరి దొంగతనం..అది ఏమిటంటే..అక్కను తీసుకు రమ్మని అమ్మ పక్కింటికి పంపింది. అప్పుడేమో వాళ్లింట్లో ఎవరు లేరు..వాళ్లింటి నిండా ఒక్క డబ్బాలో గోళీలు..నాకు గోళీలాడడమంటే ఇష్టం.కాని ఇంట్లో ఒప్పుకోరు.అందుకని కొన్ని గోళీలు నా ఫాంటు జోబిలో వేసుకొని పారిపోయాను. ఇప్పుడు అది తలచుకుంటే నాకు నవ్వనిపిస్తుంది. మరి చాలా తమాషాగా అనిపిస్తుంది నాకే ఈ విషయం. ఇవ్వని జరిగేటప్పుడు నాకు ఒక 5 ఏళ్ల వయసు ఉంటుంది.నాకు తెలిసి 1997 లో అంటే నాకు ఒక 8 ఏళ్ల ప్రాయం ఉంటుంది. అప్పుడే మేము కుటుంబంతో మొత్తంగా ఊరు విడిచి చెన్నై పయనమయ్యాము.

No comments:
Post a Comment