ఆడుతూ పాడుతూ సాగిపోయిది జీవనం. అక్కతో ఎందుకో ఏ రోజు పెద్దగా కలిసి ఉండింది లేదుగాని. ఎప్పుడూ మా పిన్ని వాళ్ల కూతుళ్లు, నా చెల్లిళ్ళతో మాత్రం కలిసి తెగ తిరిగేవాణ్ణి. ఎక్కడకు వెల్లినా మేమొక జట్టుగా ఉండేవాళ్లం. మా పెద్ద చెల్లి పేరు రోజ, చిన్న చెల్లి పేరు విజయ. మొదటి నుంచి నాకు చిన్న చెల్లి అంటేనే ఇష్టం.
మేము మద్రాస్ వచ్చిన మొదటి దీపావళి నాకు బాగా గుర్తు మా నాన్న అప్పుడు అయ్యప్ప మాల వేసి వున్నాడు. అంతకు ముందే హుండీలో డబ్బులు దాచేవాడు. దీఫావళికి అందరూ టపాకాయలు పేలూస్తూ ఉన్నారు అక్కడ అంతా. నేను మాత్రం సాధారణంగానే కూర్చోని అందరూ కాలుస్తుంటే చూస్తూన్నాను. తరువాత అమ్మ ఏవో కొన్ని టపాకాయలు కొనింది.అవి చాలా తక్కువ అనిపించింది నాకు. అందరూ కలుస్తున్నారు నేను తప్ప. చెల్లి వాళ్లు కూడా కాలుస్తూ కనబడ్డారు. ఆ సమయం నాకు అదొక హేళనగా అనిపించింది. వెంటనే నాన్న హుండీలో దాస్తున్న డబ్బులు మెల్లగా దొంగిలించాను. కాని మా అన్నయ్య అది భయట పెట్ట్డంతో నాన్న నన్ను చావబాదాడు. ఆ రోజు నేను వెక్కి వెక్కి ఏడ్చాను. అమ్మ ఏమో పండగ రోజున పాపం ఎందుకు వాణ్ణి కొట్టడం అని వారించింది. ఇంతకు నేను ఆ హుండీ నుండి తీసింది 25 రూపాయలు మాత్రమే తెలుసా?

No comments:
Post a Comment