నాకు ఊహ తెలిసి ఒక 1997-98 మధ్యలో చెన్నై వచ్చి జీవనం సాగించాం.. అప్పటికి ఒక లారీలో అన్ని సామాన్లతో మద్రాసులో అడుగు పెట్టాం. నాకు బాగా గుర్తు ఒక మేరీ మాత విగ్రహం ప్రక్కన సరిగ్గా మేము ఆగాం.. అమ్మ పిన్ని కి ఫోన్ చేసి అక్కడి నుండి బయలుదేరాం.
అక్కడ మొట్టమొదటగా ఒక చిన్న రూములో అద్దెకు దిగాం. సరిగ్గా అప్పుడు దాని అద్దె నెలకు 500. ఎవరైన ఇద్దరు వ్యక్తులు వస్తే మరొకరు ఇంటి బయట వేచి వుండాలి. ఏలాగైతేనేమి నాన్నకు మా చిన్నాన్న చేస్తున్న షాపులోనే ఇస్త్రీ చేసేందుకు పని దొరికింది.
అన్నట్లు చెప్పడం మరిచా .. మేము ఏలూరులో ఉన్నప్పుడే అక్క చదువుపై ఆసక్తి లేకపోవడంతో తను మద్రాస్ లో ఇంటి పనికి కుదిరింది. తరువాత మేము చెన్నై చేరాక అక్కను అక్కడ నుండి పని మానిపించింది అమ్మ. కొద్ది రోజుల తరువాత అక్క తనే ఒక ఎక్సపోర్ట్ కంపెనిలో పనికి కుదిరింది..
ఇక నా విషయానికి వస్తే నేను చాలా చిన్న పిల్లవాడిని కావడం చేత నన్ను 'పాలవాడీ' అని చిన్న పిల్లలకై ఒక విద్యాకేంద్రం అది. నేను మా పిన్ని వాళ్ల కూతురు కలిసి అక్కడ కు వెల్లేవాళ్ళం. అక్కడ రకరకాల బొమ్మలు పెట్టి కథలు అవి చెప్పి నిద్ర పుచ్చేవారు. నిద్ర లేవగానే ఒక పెద్ద సున్నుండను చేతికి ఇచ్చి పంపే వారు. నా మట్టుకైతే ఆ తెలియని వయసులో కేవలం ఆ సున్నుండల కోసమే అక్కడికి వెళ్లి వచ్చే వాణ్ణి .
ఏలూరులో అయితే రెండో తరగతి వరకు చదువు సాగింది కాని ఇక్కడికి వచ్చాక అంత అరవ చదువులు కావడంతో నన్ను స్కూలుకు పంపేందుకు అమ్మ భయపడేది. పైగ తమిళ పిల్లలు నన్ను కొట్టేస్తారేమో నని తెగ భయపడింది..దానితో చదువు అర్ధాంతరంగానే ఆగిపోయింది ఓ రెండేళ్ల వరకు.

No comments:
Post a Comment