పెద్దమ్మ నన్ను ఊరి నుండి తీసుకువచ్చి పాయకరావుపేట లోని ఈ మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో చేర్పించించింది. పాయకరావుపేట అనేది విశాఖజిల్లా పరిధిలోకి వస్తుంది. చెన్నై నుండి వచ్చాక మా అన్నయ్య సాయంతో ఇక్కడ బడిలో చేరాను..ఏలూరిలో రెండవ తరగతి వరకు చదవడంతో ఇక్కడ నన్ను మూడవ తరగతిలో చేర్చారు. చెరే ముందు నా చేతికి తెలుగు పుస్తకమొకటి ఇచ్చి చదవమన్నారు. నేను వేగంగా చదవడంతో సరే ఇక చాలు రేపటి నుంచి జాయిన్ అవ్వమని చెప్పారు. కాని అన్నయ్య ఏమో నన్ను అక్కడే ఉండు అని వదిలేసి వెళ్లాడు. చేరిన మొదటిలో చాలా భయపడే వాణ్ణి ఎందుకంటే అమ్మను నాకు తెలిసి ఎక్కువ రోజులు విడిచి ఉండాలనే తలంపు ఒక ప్రక్క, కొత్త వాతావరణంలో త్వరగా కలవలేని తత్వం నాది.దానితో చాలా భాధ పడేవాణ్ణి. నెమ్మదిగా ఒక్కొక్కరు స్నేహితులయ్యారు. బడిలో నా స్నేహితులంటే ముఖ్యంగా గుడివాడ వీరబాబు,సూరిబాబు,పూర్ణచందర్, ఎర్రా వేణుగోపాల్,వర్రె నూకరాజు, వైదాడి ప్రసాద్...నా క్లాసుమేట్స్ ఏమో ఏడిద చిన్నబ్బాయి,కొత్తేల గౌరిదేవి,లోవరాజు, శ్రీను,విజయ,దేవి,కాకినాడ దేవి,దుర్గారావ్ అని ఉండేవారు. వెళ్లిన కొత్తలోనే నేను బాగా చదువుతున్నానే అభిప్రాయంతో అధ్యాపకులందరూ నాతో చనువుగా వుండే వారు. పైగా నేను చెన్నైలో ఉండడం వలన తెలుగు పదాలకు అర్ధాలు అడిగేవారు తమిళంలో.
నాకు సరిగ్గా గుర్తులేదు కాని.. నాకు తెలిసి అక్కడ ప్రకాశం మాస్టారు ఉండేవారు ఆయన చాలా బాగా లెక్కలు చెప్పేవారు.చండశాసనుడు అయితే.నేను చెరిన ఏడాదే ఆయన రిటారైనారు. తర్వత సుధాకర్ మాష్టారు, నాగమణి మేడం,రాఘవేంద్ర మాష్టరు, రాజు మాష్టరు ఉండే వారు. ఊరి బడి కావదంతో మాతో ప్రతి పని చేయించుకొనేవారు.. సుధాకర్ మాష్టరు అయితే అక్కడ పిల్లలతో తన హీరోహోండా బండి తుడిపించేవాడు. నాగమణి మేడం అయితే పిల్లల పెరటి నుండి కూరగాయలు తెప్పించేది. ఉన్న దాంట్లో రాఘవేంద్ర మాష్టరు చాలా మంచి వారు.
చిన్నప్పటి నుంచి నాకు వెటకారం, జోకులు వెయ్యడం ఎక్కువ, కాని కొద్దిపాటి పరిచయం ఉన్న వాళ్ల దగ్గర కాని, పెద్దవాళ్ల దగ్గ్ర కాని ముఖ్యంగా మా శివన్నయ్య దగ్గర కాని చాలా మౌనం పాటిస్తాను.. బడిలో వరకు నేనెప్పుడు రాముడు మంచి బాలుడు అనే విధంగా నడుచుకొనేవాణ్ణి..

No comments:
Post a Comment